LOADING...
Rashmika : ఐటెం సాంగ్స్‌పై రష్మిక కఠిన నిర్ణయం.. దర్శకులకు ఊహించని షాక్!
ఐటెం సాంగ్స్‌పై రష్మిక కఠిన నిర్ణయం.. దర్శకులకు ఊహించని షాక్!

Rashmika : ఐటెం సాంగ్స్‌పై రష్మిక కఠిన నిర్ణయం.. దర్శకులకు ఊహించని షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో కనిపించడం ఒక స్పష్టమైన ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే సమంత, తమన్నా వంటి ప్రముఖ నాయికలు ఈ తరహా పాటలతో భారీ విజయాలను అందుకున్నారు. ఇదే క్రమంలో 'నేషనల్ క్రష్'గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న కూడా తన డ్యాన్స్‌తో యువతను ఆకట్టుకోవడంతో, దర్శక-నిర్మాతలు ఆమెతో ఐటెం సాంగ్స్ చేయించుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. రష్మికను హీరోయిన్‌గా తీసుకుంటే గ్లామర్‌తో పాటు స్పెషల్ సాంగ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో రష్మిక తాజాగా అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.

Details

రష్మిక చేతిలో భారీ ప్రాజెక్టులు

తాను కేవలం ఇద్దరు దర్శకుల సినిమాల్లో మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని, మిగతా దర్శకులకు ఈ విషయంలో అందుబాటులో ఉండబోనని ఆమె స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఆ ఇద్దరు ఫేవరెట్ దర్శకులు ఎవరో మాత్రం ఇప్పటికి సస్పెన్స్‌గా ఉంచింది. ఈ కండిషన్ విన్న మిగతా డైరెక్టర్లు మాత్రం కొంత నిరాశకు గురవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు ఉన్న క్రేజ్‌ను తమ సినిమాల కోసం వినియోగించుకోవాలని ఆశించిన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రష్మిక చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉండటంతోనే ఆమె ఈ విషయంలో సెలెక్టివ్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది.

Details

'కాక్‌టెయిల్ 2' వంటి పెద్ద ప్రాజెక్టుల్లో బిజీ

ప్రస్తుతం రష్మిక 'మైసా' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో బిజీగా ఉంది. ఇదే సమయంలో బాలీవుడ్‌లో 'కాక్‌టెయిల్ 2' వంటి పెద్ద ప్రాజెక్టుల్లోనూ నటిస్తూ బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తోంది. చేతినిండా సినిమాలు ఉండటం, కెరీర్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టడమే ఈ నిర్ణయానికి కారణమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి రష్మిక స్పెషల్ సాంగ్స్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ ఇద్దరు లక్కీ దర్శకులు ఎవరో తెలియాలంటే, ఆమె స్వయంగా రివీల్ చేసే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement