
Ratan Tata: 'వీడ్కోలు నేస్తమా'.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్ గ్రహీత,టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
ఆయన మృతిపై అతని మాజీ ప్రేయసి,బాలీవుడ్ నటి సిమి గరెవాల్ సంతాపం తెలిపారు."ఇక నువ్వు లేవని అంటున్నారు.ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా" అంటూ రతన్ టాటాతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆమె ట్వీట్ చేసింది.
2011లో హిందుస్థాన్ టైమ్స్తో జరిగిన ఇంటర్వ్యూలో సిమి, తాను రతన్ టాటాతో డేటింగ్ చేసినట్లు, ఆ తర్వాత ఇద్దరు విడిపోయినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ భామ ఓ ఇంగ్లీష్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తర్వాత బాలీవుడ్, బెంగాలీ వంటి భాషల చిత్రాల్లో నటించి మెప్పించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సిమి గరెవాల్ చేసిన ట్వీట్
They say you have gone ..
— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024
It's too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV