
RT 76 : జాక్‌పాట్ కొట్టిన రవితేజ.. టైటిల్ రిలీవ్ కాకుండానే భారీ డీల్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాస్ జాతర' చిత్రానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మాస్ జాతర' సెట్స్‌పై బిజీగా ఉన్నప్పటికీ, రవితేజ తన తదుపరి చిత్రానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నేను శైలజా, చిత్రలహరి వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ తన 76వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా మాస్ యాక్షన్, రవితేజ స్టైల్ కామెడీ, కిషోర్ తిరుమల ప్రత్యేక టేకింగ్‌తో కూడిన ఎమోషనల్ టచ్‌లతో కలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది.
Details
శాటిలైట్ రైట్స్‌ను భారీ డీల్ దక్కించుకున్నట్లు సమాచారం
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్ ఇప్పటికే ముగిసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్‌ను కూడా భారీ మొత్తానికి దక్కించుకుంది. ఇంకా టైటిల్ ప్రకటించకముందే రైట్స్ అమ్ముడవ్వడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసుకోనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.