Page Loader
Mass Jathara: శ్రీలీలతో కలిసి 'మాస్ జాతర'కు సిద్ధమైన రవితేజ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
శ్రీలీలతో కలిసి 'మాస్ జాతర'కు సిద్ధమైన రవితేజ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Mass Jathara: శ్రీలీలతో కలిసి 'మాస్ జాతర'కు సిద్ధమైన రవితేజ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా వస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' విడుదల తేదీ ఖరారైంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, పాటల ద్వారా సినిమా పక్కా మాస్ ఫెస్టివల్ మూవీగా రూపుదిద్దుకుంటోందని స్పష్టమైంది. తాజా సమాచారం మేరకు, సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉంది. చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న 'మాస్ జాతర' థియేటర్లలో సందడి చేయనుంది.

Details

ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొనేలా కథ

ఈ విడుదల తేదీ సమీపంలో ఎటువంటి పెద్ద సినిమా లేకపోవడం వల్ల 'మాస్ జాతర'కి సోలో రిలీజ్ విండో దక్కినట్లు అయింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్‌లతో శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. అలాగే, పలు ప్రముఖ నటులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌, మాస్ ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకునేలా దర్శకుడు భాను భోగవరపు ఈ కథను డిజైన్ చేశారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.