Mass Jathara OTT: ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్న మాస్ జాతర.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మాస్ జాతర'(Mass Jathara OTT) ఇటీవల విడుదలైంది. అందాల భామ శ్రీలీల ఇందులో లీడ్ హీరోయిన్‌గా నటించగా,ఈ సినిమాకు కొత్త దర్శకుడు భాను బోగవరపు మెగాఫోన్ చేపట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నాగ వంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. పూర్తిగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీఅంచనాల మధ్య రిలీజైనప్పటికీ,ఈచిత్రానికి ఆశించినంత పాజిటివ్ స్పందన రాలేదు. కథలో కొత్తదనం లేకపోవడం,నరేషన్ కూడా సాదాసీదాగా సాగిపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కొంతమంది రవితేజ అభిమానులు మాత్రమే సినిమా నచ్చిందని చెప్పినా, మొత్తం ప్రేక్షకుల్లో మాత్రం ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేదు.
వివరాలు
నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో..
దీంతో మాస్ జాతర సినిమా రవి తేజ కెరీర్ లో మరో ప్లాప్ సినిమాగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో, చిత్రయూనిట్ సినిమాను త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. 'మాస్ జాతర' ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ముందుగానే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో పెద్దగా ఆదరణ లేకపోయినప్పటికీ, సినిమా చూసేందుకు చాలామంది అవకాశం పొందకపోవడంతో ఓటీటీలో మాత్రం మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు
రవితేజ ప్రాజెక్ట్స్
ఇక రవితేజ రాబోయే ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సెన్సిటివ్ సబ్జెక్టులను తెరకెక్కించడంలో పేరున్న దర్శకుడు కిషోర్ తిరుమలతో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని టీమ్ ప్రకటించింది. ఈ చిత్రంతో అయినా రవితేజ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడా అన్నది చూడాలి.