LOADING...
Mass Jathara: వాయిదా పడిన రవితేజ 'మాస్ జాతర'.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
వాయిదా పడిన రవితేజ 'మాస్ జాతర'.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Mass Jathara: వాయిదా పడిన రవితేజ 'మాస్ జాతర'.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న కొత్త చిత్రం 'మాస్ జాతర'. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. తాజాగా నవంబర్‌ 27న రిలీజ్ చేయాలనుకున్న 'మాస్ జాతర' మళ్లీ వాయిదా పడిందని టీమ్‌ తెలిపింది.

Details

సమ్మె కారణంగా వాయిదా

పరిశ్రమలో జరుగుతున్న సమ్మెలు, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పనులు ఇంకా పూర్తికాలేదని యూనిట్‌ స్పష్టం చేసింది. సినిమా పనులు పూర్తి అయిన తర్వాత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. సినిమా విడుదల ఆలస్యమైనా, ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందించడమే తమ లక్ష్యమని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్‌గా కీలక పాత్రలో కనిపించనున్నాడు.