Raviteja: 'మాస్ జాతర' తర్వాత రవితేజ కొత్త ప్రాజెక్ట్.. క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో మూవీ ఓకే!
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజ రవితేజ సంవత్సరానికి కనీసం రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు.
గతేడాది కూడా ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలొచ్చినా అవి రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.
ఈ నేపథ్యంలో రవితేజ సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం రవితేజ 'మాస్ జాతర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే, గతంలో ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేతిలో ఉంచుకునే రవితేజ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉండటం ఆశ్చర్యకరం.
Details
మాస్ జాతర వేసవిలో రిలీజ్
'మాస్ జాతర' సినిమా తర్వాత రవితేజకు ఇంకా ఎటువంటి సినిమాలు లేవు.
తాజాగా రవితేజ ఒక కొత్త సినిమా ఓకే చేశాడని సమాచారం. ఈసారి క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది.
తన కెరీర్‌లో నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి క్లాస్ హిట్ సినిమాలను అందించిన కిషోర్ తిరుమలకు రవితేజ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కిషోర్ తిరుమల రవితేజకు కథ వినిపించాడట.
కథ నచ్చడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మాస్ జాతర మూవీ రిలీజ్ అయిన తర్వాత కిషోర్ తిరుమల సినిమాను ప్రారంభించనున్నారు.