Mahadhan Ravi Teja: హీరో అవుతాడనుకుంటే.. డైరెక్షన్ వైపు మళ్లిన రవితేజ కొడుకు!
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ కుమారుడు మహాధన్ రవితేజ తొలిసారిగా 'రాజా ది గ్రేట్' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
అతని అభినయం చూసిన వారంతా భవిష్యత్తులో హీరోగా ఎదుగుతాడని భావించారు. అయితే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా మహాధన్ నటనకు బదులుగా దర్శకత్వ విభాగాన్ని ఎంచుకున్నాడు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న 'స్పిరిట్' చిత్రానికి మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నాడు.
ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో మహాధన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కుమారులు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేరతారని సమాచారం.
Details
మహాధన్ ను నటన కంటే మేకింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి
ఈ చిత్రానికి ఇప్పటికే 12 నుంచి 14 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పని చేస్తున్నారు.
అయితే ఒక స్టార్ హీరో కుమారుడు, మరో స్టార్ దర్శకుడి కుమారులు కలిసి పనిచేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మహాధన్ నటనకంటే సినిమా మేకింగ్ పట్ల ఆసక్తి చూపించడంపై సినీ ప్రేమికులు, ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.