Ravi Teja: చిరంజీవి స్ఫూర్తిగా నటనలోకి వచ్చిన రవితేజ.. 'మాస్ జాతర'పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
హీరో రవితేజ మరోసారి తన మాస్ స్టైల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన "మాస్ జాతర" చిత్రం ఈ నెల అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో రవితేజ ప్రమోషన్ల వేగం పెంచారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపారు.
వివరాలు
వినాయక చవితికి రిలీజ్ చేద్దాం అనుకున్నాం: రవితేజ
"మాస్ జాతర సినిమా కొంచెం ఆలస్యమైంది. షూటింగ్ సమయంలో నాకు కొన్ని గాయాలు కావడంతో పనులు తరచుగా వాయిదా పడ్డాయి. మొదట సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాం, తర్వాత వేసవిలో ఆలోచించాం, ఆ తరువాత వినాయక చవితికి రిలీజ్ చేద్దాం అనుకున్నాం... కానీ ఏ తేదీ కుదరలేదు. ఇప్పుడు మాత్రమే సరైన సమయం దొరికింది అనిపిస్తోంది. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. నా కెరీర్‌లో సినిమా స్టార్ట్ చేసి ఇంత ఆలస్యంగా రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి"
వివరాలు
చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటా: రవితేజ
"జయాపజయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. నా పని ఎంత బాగా చేయగలనో అంత శాతం కష్టపడి చేస్తాను. అదే నేను అందరికీ చెప్పే సలహా.మన పని మనస్పూర్తిగా చేస్తూ వెళ్తే ఒక రోజు కచ్చితంగా ఫలితం వస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గిపోతే ఏదీ సాధ్యం కాదు. మనపై మనకున్న నమ్మకమే నిజమైన బలం. నటనకు నేను ఎప్పుడూ రిటైర్మెంట్ తీసుకోను. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను నేను పట్టించుకోను, అందుకే అవి నన్ను ప్రభావితం చేయవు" అని రవితేజ తెలిపారు.