
ధమాకా కాంబినేషన్ మళ్ళీ రిపీట్: శ్రీలీల ఖాతాలో మరో సినిమా?
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ, శ్రీలీల జంటగా వచ్చిన ధమాకా చిత్రం, థియేటర్ల వద్ద నిజమైన ధమాకాను చూపించింది. వందకోట్లకు పైగా వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రంలో రవితేజ, శ్రీలీల కలిసి వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పల్సర్ భైక్ పాట మీద అయితేనేమీ, జింతక్ జింతక్ పాట మీదైతేనేమీ రవితేజతో పోటీపడి మరీ డ్యాన్సులు ఇరగదీసింది శ్రీలీల.
ప్రస్తుతం వీరిద్దరి జోడీ మళ్ళీ తెరమీదకు రాబోతుందని సమాచారం.
వీరసింహారెడ్డి సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో, శ్రీలీలను తీసుకోవాలనిఅనుకుంటున్నారట . ఆల్ మోస్ట్ ఫిక్స్ ఐపోయారని టాక్.
Details
ఆ రెండు సినిమాలు పూర్తయ్యాకే ముహూర్తం
రవితేజ, శ్రీలీల కలిసి చేస్తున్న మరో సినిమాపై అధికారిక సమచారం రానప్పటికీ, ధమాకా జోడీ ఫిక్స్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే మరో మంచి మాస్ మసాలా సినిమా పడితే బాగుండునని అభిమానులు కోరుకుంటున్నారు.
అదలా ఉంచితే, రవితేజ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. టైగర్ నాగేశ్వర్ రావు, ఈగిల్ చిత్రాలు ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఇవి రెండు పూర్తయిన తర్వాతే గోపీచంద్ మలినేనితో తీయబోయే సినిమాను మొదలుపెడతారని అంటున్నారు.
ఇకపోతే శ్రీలీల ఏడెనిమిది సినిమాలున్నాయి. బిజీ షెడ్యూల్స్ లోనూ మరిన్ని సినిమా ఛాన్సులు దక్కించుకుంటోంది ఈ భామ. మరి రవితేజతో నటించే సినిమాపై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి.