టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ లో రవితేజకు గాయాలు.. 12కుట్లతో రెండు రోజుల్లోనే షూటింగుకు వచ్చిన మాస్ మహారాజ
రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్ర ప్రమోషన్లు జోరు మీద సాగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల సిద్ధమవుతున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని హిందీలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ముంబైలో ఉంటూనే ప్రమోషన్లలో టైగర్ నాగేశ్వరరావు టీం పాల్గొంటుంది. తాజాగా ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్, టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ సమయంలో రవితేజకు గాయాలు అయ్యాయని చెప్పుకొచ్చారు. ట్రైన్ మీద నుండి లోపలికి దూకే షాట్ చేస్తున్నప్పుడు మోకాలి పైన భాగానికి గాయమైందని నిర్మాత అన్నారు.
గాయమైన రెండు రోజుల్లోనే షూటింగుకు వచ్చేసిన రవితేజ
అభిషేక్ అగర్వాల్ మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. గాయమైనా కూడా సినిమా షూటింగుకు రావడంతో సినిమా మీద రవితేజకు ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుందని అభిమానులు అంటున్నారు. అదలా ఉంచితే, టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ ఇతర కీలకపాత్రలో కనిపిస్తున్నారు. వంశీ దర్శకత్వం వహించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం అక్టోబర్ 19వ తేదీన విడుదల అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అవుతుంది.