'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్ రిలీజ్: మాస్ అంశాలతో ఆసక్తి కలిగిస్తున్న ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. ఆంధ్రప్రదేశ్ లోని స్టువర్టుపురం ప్రాంతంలో గజదొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని గతంలో వెల్లడి చేసారు. తాజాగా టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. స్టువర్టుపురం ప్రాంతంలో దొంగతనాలు, ఆ ప్రాంతంలో వెళ్తున్న రైలును దోచుకోవడం వంటి సంఘటనలను ట్రైలర్ లో చూపించారు. స్టువర్టుపురం దొంగగా టైగర్ నాగేశ్వరరావు జీవితం ఎలా మొదలైందనే దగ్గర నుండి టైగర్ నాగేశ్వర రావు గారు ఎలా మారిందనే వరకు సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది.
దసరా కానుకగా రిలీజ్ అవుతున్న చిత్రం
ట్రైలర్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. మాస్ ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ట్రైలర్లో కనిపించాయి. చూస్తుంటే రవితేజ కెరీర్లో మరో మంచి మాస్ మసాలా చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు నిలిచిపోనుందని అర్థం అవుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమాను కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కించారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపిస్తున్న టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. మురళీ శర్మ, రేణు దేశాయ్ నాజర్ ఇతర కీలకపాత్రలో కనిపిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతుంది.