Razakar: రజాకార్ సినిమా కాదు.. మన చరిత్ర.. మూవీ ఎలా ఉందంటే..?
తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన'రజాకార్' సినిమా ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాకలి ఐలమ్మగా ఇంద్రజ,రాజిరెడ్డిగా బాబీ సింహ తమ పాత్రలలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఖాసీం రీజ్వి పాత్రలో రాజ్ అర్జున్ కనబరిచిన నటన ప్రేక్షకుల్నికట్టిపడేస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు బలాన్నిచ్చింది. ఈ చిత్రం హైదరాబాద్ లో హిందూ వ్యతిరేక హింసాకాండను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రజాకార్లు హిందువులపై ఎలా అసభ్యంగా ప్రవర్తించారు,బలవంతంగా మత మార్పిడులు ఎలా జరిగాయి,దానిని ధిక్కరించిన వారు హింసను,బహిష్కరణను లేదా మరణశిక్షను ఎలా ఎదుర్కొంటారు అన్నది కళ్లకికట్టినట్లు చూపించారు. ఈ చిత్రంలో కేంద్ర హోంమంత్రి దివంగత సర్దార్ పటేల్‌ను హీరోగానూ,ఖాసీం రజ్వీని విలన్‌గానూ చూపించింది(దర్శకుడి దృష్టిలో)!
డైరెక్టర్ గా మొదటి సినిమా..
ఈ సినిమాకి డైరెక్టర్ యాట సత్యనారాయణ. డైరెక్టర్ గా ఈ సినిమా ఆయనకు మొదటి సినిమా. సినిమా ప్రెసెంట్ చేసిన విధానం,పాత్రల ఎంపిక,1948 నాటి స్క్రీన్ ప్లే తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. రజాకార్లు మహిళలతో వివస్త్రలను చేసి బతుకమ్మను ఆడించడం.. బైరాన్‌పల్లి నరమేధం లాంటి సీన్ ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి.అనసూయతో బతుకమ్మ పాట హైలెట్. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో స్టంట్ మాస్టర్స్ ఎఫెక్ట్ మాత్రం స్క్రీన్ ఫై బాగా కనిపిస్తుంది ఎక్కడ కూడా నటిస్తున్నారనే డౌట్ రాదు .