
Devara 2: 'దేవర 2'పై స్పందించిన ఎన్టీఆర్.. కొరటాల శివకు హాలీడేస్ ఇచ్చా
ఈ వార్తాకథనం ఏంటి
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' భారీ విజయాన్ని సాధించి అభిమానులను ఉత్సాహభరితులుగా మార్చింది.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. 'దేవర' మొదటి భాగం సక్సెస్ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ 'దేవర 2' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మొదటి భాగం షూటింగ్ సమయంలోనే 'దేవర 2' కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించామని, మొదటి భాగం విజయవంతం కావడంతో, సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నామని చెప్పారు.
Details
దేవర 2 కోసం కథ సిద్ధం
ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని, కానీ దాన్ని మరింత మెరుగుపరచాలన్న ఆలోచనతో కొంత సమయం తీసుకుంటున్నామని తారక్ అన్నారు.
కొరటాల శివ ఈ చిత్రానికి ఎంతో కష్టపడ్డారని, అందుకే ఆయనకు ఒక నెలన్నర విశ్రాంతి తీసుకోమని సూచించానని చెప్పారు.
ఆ విరామం తర్వాత 'దేవర 2' పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.