Loading...
Deepika Padukone: ప్రెగ్నెన్సీలోనే యాక్షన్‌కు రెడీ.. 'రాకా' కోసం దీపికా పదుకొణె సాహసం!
ప్రెగ్నెన్సీలోనే యాక్షన్‌కు రెడీ.. 'రాకా' కోసం దీపికా పదుకొణె సాహసం!

Deepika Padukone: ప్రెగ్నెన్సీలోనే యాక్షన్‌కు రెడీ.. 'రాకా' కోసం దీపికా పదుకొణె సాహసం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన వృత్తిపరమైన అంకితభావాన్ని మరోసారి నిరూపిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న, అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'రాకా'లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా గర్భవతిగా ఉన్నప్పటికీ, దీపికా కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవల 'ఎనిమిది గంటల పని' విధానాన్ని ప్రోత్సహిస్తూ వార్తల్లో నిలిచిన దీపికా, 'రాకా' షూటింగ్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రత్యేక పరిమితులు పెట్టుకోకుండా పూర్తి అంకితభావంతో పనిచేసినట్లు తెలుస్తోంది.

వివరాలు

ప్రశంసిస్తున్న నెటిజన్లు

రెండో బిడ్డకు జన్మనివ్వడానికి ముందు మెటర్నిటీ బ్రేక్ తీసుకునే లోపే తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అంతేకాదు, ఒకవైపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు తన మొదటి కుమార్తె దువా సంరక్షణను కూడా సమర్థంగా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

కుటుంబ బాధ్యతలు, కెరీర్ రెండింటినీ సమతూకంగా నిర్వహిస్తున్న దీపికాను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'రాకా' చిత్రాన్ని అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్, దీపికా పదుకొణె తొలిసారి ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT