Page Loader
Saiyami Kher : 'ట్రయథ్లాన్‌'లో రికార్డు సృష్టించిన నటి సయామీ ఖేర్
'ట్రయథ్లాన్‌'లో రికార్డు సృష్టించిన నటి సయామీ ఖేర్

Saiyami Kher : 'ట్రయథ్లాన్‌'లో రికార్డు సృష్టించిన నటి సయామీ ఖేర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, కొందరు హీరోయిన్లు ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపిస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలాంటి వారిలో సయామీ ఖేర్‌ ఒకరు. ఫిట్‌నెస్‌కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఆమె, విదేశాల్లో నిర్వహించే ట్రయథ్లాన్‌ పోటీల్లో చురుకుగా పాల్గొంటూ అరుదైన రికార్డు నెలకొల్పారు. తాజాగా, ఏడాది వ్యవధిలో రెండుసార్లు 'ఐరన్‌మ్యాన్‌ 70.3' పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించారు. గతేడాది సెప్టెంబరులో తొలిసారిగా ఈ పోటీలో మెడల్‌ గెలుచుకున్న సయామీ, ఇప్పుడు స్వీడన్‌లో జరిగిన రేస్‌లో మెరిసి మరో మెడల్‌ను సాధించారు. ట్రయథ్లాన్‌ పోటీలో 1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్ల పరుగు ఉన్నాయి.

వివరాలు 

32 నిమిషాల ముందుగానే రేస్‌ పూర్తి

ఈ పోటీ అత్యంత శారీరక కఠినత కలిగిన పోటీల్లో ఒకటి. ఈ విజయంపై సయామీ స్పందిస్తూ, తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమేనని పేర్కొంటూ, ఈ ప్రయాణం ప్రపంచానికి తాను ఏవరో నిరూపించుకోవాలన్న ఆలోచనతో కాదు, తన మనసుకు నచ్చింది చేసేందుకే చేసిన పని అని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రేస్‌ను 32 నిమిషాల ముందుగానే పూర్తి చేశానని తెలిపారు.

వివరాలు 

'జాట్‌'లో కీలక పాత్ర

నాసిక్‌కు చెందిన సయామీ ఖేర్‌ తెలుగు సినిమా 'రేయ్‌' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించారు. అనంతరం బాలీవుడ్‌లో అవకాశాలు లభించగా, కొంత గ్యాప్‌ తర్వాత 'వైల్డ్‌డాగ్‌' చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఆ తర్వాత తెలుగులో నటించలేదు. ఇటీవలి హిందీ చిత్రం 'జాట్‌'లో కీలక పాత్ర పోషించారు. ట్రయథ్లాన్‌ కోసం ఆమె ఏడాది పాటు కఠినంగా శిక్షణ తీసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సయామీ ఖేర్‌ చేసిన ట్వీట్