Devara: 'దేవర' రిలీజ్ ముందే రికార్డులు.. ప్రశంసలు కురిపించిన సుమన్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దేవర' భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు పలు రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రంపై తాజాగా నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడని, విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టించడం ఒక చరిత్రగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. 'దేవర'కు ఇంత క్రేజ్ రావడానికి స్టోరీ, దర్శకుడు, టీమ్ ప్రధాన కారణమని తెలిపారు.
పుష్ప-2ను దాటేసిన దేవర
ఎన్టీఆర్ చిన్నప్పటి నుండి క్లాసికల్ డ్యాన్సర్ అని, ఫైట్స్‌పై కూడా ఆయనకు మంచి అవగాహన ఉందన్నారు. 'దేవర'భారీ విజయం సాధించాలని సుమన్ పేర్కొన్నారు. 'దేవర' బుక్‌మైషోలో 'పుష్ప2'ను మించిపోయింది. 'పుష్ప2' కోసం 3,34,000 మంది ఆసక్తి చూపించగా, 'దేవర' కోసం ఏకంగా 3,36,000 మంది ఆసక్తి చూపించినట్లు పేర్కొంది. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు.