LOADING...
Mana Shankara Vara Prasad Garu: 'రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రేమే శాశ్వతం'.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
'రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రేమే శాశ్వతం'.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Mana Shankara Vara Prasad Garu: 'రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రేమే శాశ్వతం'.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాక్సాఫీస్‌ వద్ద 'మన శంకరవరప్రసాద్‌ గారు' చిత్రం సాధించిన ఘన విజయంపై మెగాస్టార్‌ చిరంజీవి భావోద్వేగంతో స్పందించారు. సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సందర్భంగా తెలుగు ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేశారు. దశాబ్దాలుగా తన ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమాకు ప్రేక్షక దేవుళ్లు అందిస్తున్న అపూర్వమైన ఆదరణ ఈ అద్భుతమైన విజయాన్ని చూస్తుంటే నా హృదయం కృతజ్ఞతతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడి ఉంది. మీరు లేకపోతే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు.

Detils

వెంట నిలబడి ఉన్నవారందరిదని ధన్యవాదాలు

ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, డిస్ట్రిబ్యూటర్లది, అలాగే సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిదని చిరంజీవి పేర్కొన్నారు. వెండితెరపై నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్‌, చప్పట్లే నాకు ముందుకు నడిచే శక్తి. రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మీరు నాపై చూపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్‌ విజయం వెనుక అహర్నిశలు కృషి చేసిన మా దర్శకుడు హిట్‌ మెషీన్‌ అనిల్‌ రావిపూడికి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలకు, అలాగే మొత్తం టీమ్‌కు, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

Details

బాక్సాపీస్ వద్ద రికార్డులు

ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్‌ యూ ఆల్‌. మీ చిరంజీవి'' అని ముగించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రాంతీయ సినిమాగా నిలిచి మరో ఘనతను సొంతం చేసుకుంది.

Advertisement