Page Loader
Nithin : నితిన్‌ 'తమ్ముడు' ఫస్ట్ సాంగ్‌కు రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?
నితిన్‌ 'తమ్ముడు' ఫస్ట్ సాంగ్‌కు రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

Nithin : నితిన్‌ 'తమ్ముడు' ఫస్ట్ సాంగ్‌కు రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'తమ్ముడు' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను 'వకీల్‌సాబ్' ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ చిత్రం విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, లయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details

ఫస్ట్ సింగిల్ జూన్ 17న రిలీజ్

అక్కాతమ్ముళ్ల భావోద్వేగాలకు నిదర్శనంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథ.. అక్కను రక్షించేందుకు తమ్ముడు చేసే పోరాటం చుట్టూ సాగనుందని ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతుంది. సాధారణంగా సినిమా టీజర్, పాటల అనంతరం ట్రైలర్ విడుదలవుతుంది. కానీ 'తమ్ముడు' చిత్రబృందం ట్రైలర్ తర్వాత మొదటి పాట విడుదల చేయడం విశేషం. ఇక ఫస్ట్ సింగిల్‌ను జూన్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. "భూ అంటూ భూతం"అనే లిరిక్స్‌తో వస్తున్న ఈ పాటపై ఆసక్తి నెలకొంది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. సెంటిమెంట్, యాక్షన్, ఎమోషన్ మేళవించిన ఈ చిత్రం నితిన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా అన్నది చూడాల్సిందే.