Page Loader
Sobhita Dhulipala: జీవితంలో ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకుంటున్నాం.. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు 
జీవితంలో ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకుంటున్నాం.. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు

Sobhita Dhulipala: జీవితంలో ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకుంటున్నాం.. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2024
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శోభితా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నిశ్చితార్థ వేడుకను గ్రాండ్‌గా జరగాలని తాను ఎప్పుడూ ఆశించలేదని, కానీ తాను జీవితంలో ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించాలనుకున్నానని చెప్పారు. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. తన తల్లిదండ్రులు, సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారని, ఈ వేడుక స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా జరిగిందన్నారు.

Details

చాలా పర్‌ఫెక్ట్‌గా అనిపించింది

అది తనకు చాలా పర్‌ఫెక్ట్‌గా అనిపించిందని పేర్కొంది. నాగచైతన్య, శోభితా చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. ఆగస్టు 8న వారి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులే మాత్రమే హాజరయ్యారు. శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ సాధించడంతో పాటు 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. నాగచైతన్య మాత్రం 'తండేల్‌' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.