సినీ పరిశ్రమలో విషాదం: భద్రాచలం సినిమాలో విలన్ గా నటించిన కజాన్ ఖాన్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మళయాలీ నటుడు, తెలుగులో బద్రి, భద్రాచలం సినిమాల్లో కనిపించిన కజాన్ ఖాన్, 46ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు.
ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఎన్ఎన్ బాదుషా, తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసాడు.
కేరళకు చెందిన కజాన్ ఖాన్ మొదటిసారిగా 1992లో సెంతమిళ పట్టు(తెలుగులో అమ్మకొడుకు)అనే సినిమాలో నటించాడు.
ఆ తర్వాత గంధర్వం, వర్ణపకిత్, డ్రీమ్స్, సీఐడీ ద మూస, మాయా మోహిని, రాజాధిరాజా వంటి చిత్రాల్లో నటించాడు. ఆయన సినిమా కెరీర్లో ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించారు.
Details
తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయని కజాన్ ఖాన్
తమిళం, మళయాలం భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసిన కజాన్ ఖాన్ తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే కనిపించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాలో కజాన్ ఖాన్ నటించాడు.
అయితే దివంగత నటుడు శ్రీహరి నటించిన భద్రాచలం సినిమాతో కజాన్ ఖాన్ కు మంచి పేరొచ్చింది. భద్రాచలం సినిమాలో విలన్ గా కనిపించి అందరినీ మెప్పించాడు.
భద్రాచలం తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు కజాన్ ఖాన్. ఆయన చివరగా నటించిన లైలా ఓ లైల్లా(మళయాల చిత్రం) 2015లో విడుదలైంది.