Renu Desai Comeback: మమ్ముట్టిని ఆకాశానికి ఎత్తిన రేణు...ఒక్కఫొటో చాలనుకుంటే
ఈ వార్తాకథనం ఏంటి
చాలా కాలం తర్వాత నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం' సినిమాతో ఆమె నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణూ దేశాయ్.. ఈ సినిమాలో అవకాశం రావడం వెనుక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. మమ్ముట్టి వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేస్తానని అసలు ఊహించలేదని చెప్పారు. గతేడాది ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు, ఎప్పటికైనా ఆయన్ను కలిసి ఒక్క ఫొటో దిగితే చాలని అనుకున్నానని గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆనందం వ్యక్తం చేశారు.
Details
కామాఖ్య ఆలయంలో ఉండగా వచ్చిన ఫోన్‌కాల్!
మహాశివరాత్రి రోజున కామాఖ్య దేవాలయంలో ఉన్న సమయంలో తనకు ఈ సినిమా అవకాశం గురించి ఫోన్ వచ్చిందని రేణూ దేశాయ్ తెలిపారు.
చెన్నై నుంచి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, మమ్ముట్టి సినిమాలో ఆయన భార్య పాత్రకు నటిస్తారా అని అడిగారని చెప్పారు.
మొదట అది నిజమైన ఆఫర్ అని నమ్మలేకపోయానని, ఎవరో సరదాగా చేస్తున్నారని భావించానని వివరించారు.
అయితే రెండు నెలల తర్వాత సినిమాకు 'ఓం' అనే పేరు ప్రకటించగానే తనకు గూస్‌బంప్స్ వచ్చాయని అన్నారు. ఈ అవకాశం వెనుక దైవ సంకల్పం ఉందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
Details
ఆరు నెలల విశ్రాంతి.. ఆహారంలో మార్పులతో కొత్త ఉత్సాహం
ఇక తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి కూడా రేణూ దేశాయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
గతేడాది ఒక సర్జరీ చేయించుకున్నానని, ఆ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నానని చెప్పారు.
ఆ సమయంలో కిచిడీ, పెసరపప్పు, సొరకాయ వంటి తేలికపాటి ఆహారానికే పరిమితమయ్యానని వివరించారు.
ఈ ఆహారపు అలవాట్లు, విశ్రాంతి తన శరీరంలో వాపు తగ్గడానికి తోడ్పడ్డాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మరింత తాజాగా కనిపిస్తుండటానికి ఇదే కారణమని చెప్పారు. సోషల్ మీడియాలో కనిపించే తన సాధారణ రూపానికి భిన్నంగా, మళ్లీ నటిగా ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.