Loading...
Pawan Kalyan : పవన్‌కు మద్దతుగా రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
పవన్‌కు మద్దతుగా రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Pawan Kalyan : పవన్‌కు మద్దతుగా రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరిపై పడితే వారిపై విమర్శలు చేయడం, బురద చల్లడం సులువైపోయింది. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా పరిణామం చోటుచేసుకుంటే చాలు.. నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడిపోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగెటివిటీ కనిపించింది. ఈ ట్రోలింగ్‌పై పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

ట్రోలర్స్‌కు రేణూ దేశాయ్ గట్టి కౌంటర్

ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని మరింతగా దూషించడం, విమర్శించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.

ఇప్పటికే బాధలో ఉన్నవారిని మరింత కుంగదీయడం రాక్షసత్వమని అభిప్రాయపడ్డారు.

వారు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా మనలాంటి మనుషులేనని, ఎవరికో ఒకరికి బిడ్డలని, తల్లిదండ్రులని లేదా తోబుట్టువులని గుర్తుంచుకోవాలని సూచించారు.

కనీస మానవత్వాన్ని మర్చిపోవద్దని ట్రోలర్స్‌కు హితవు పలికారు.

వివరాలు

గాజు ఇళ్లలో ఉంటూ.. ఇతరులపై రాళ్లు వేయొద్దు!

రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో ఉపయోగించిన ఓ వాక్యం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

మనమంతా ఎన్నో లోపాలతో కూడిన గాజు ఇళ్లలో జీవిస్తున్నామని, అలాంటప్పుడు ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరడం మానుకోవాలని విమర్శకులకు చురకలు అంటించారు.

ADVERTISEMENT

వివరాలు

'పేటీఎం డబ్బులు రాలేదు'.. సైంటిఫిక్ కౌంటర్

తాను పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నానంటూ కొందరు విమర్శిస్తారని ముందే ఊహించిన రేణూ దేశాయ్.. తనకు ఇలా మాట్లాడినందుకు ఎలాంటి 'పేటీఎం' డబ్బులు అందలేదని స్పష్టం చేశారు.

సానుభూతి, దయ అనేవి ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలని పేర్కొన్నారు. తన మెదడులోని 'ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్' సరిగ్గా పనిచేస్తోంది కాబట్టే ఒక మనిషిగా ఇలా స్పందించగలుగుతున్నానని అన్నారు. దీనిపై పనికిమాలిన ఊహాగానాలు చేయవద్దని ట్రోలర్స్‌కు గట్టి సమాధానమిచ్చారు.

విడిపోయిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న విమర్శల నేపథ్యంలో రేణూ దేశాయ్ స్పందించిన తీరు చర్చకు దారితీసింది.

పగ, ప్రతీకారాలను పక్కనపెట్టి కష్టాల్లో ఉన్నవారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని ఆమె తన పోస్ట్ ద్వారా సందేశమిచ్చారు.

ADVERTISEMENT