Page Loader
Retro: ప్రేమికుల రోజు కానుకగా 'రెట్రో' ఫస్ట్ సింగిల్ రిలీజ్
ప్రేమికుల రోజు కానుకగా 'రెట్రో' ఫస్ట్ సింగిల్ రిలీజ్

Retro: ప్రేమికుల రోజు కానుకగా 'రెట్రో' ఫస్ట్ సింగిల్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో 'రెట్రో' ఒకటి. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజాగా వచ్చిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్ సూర్య, పూజాహెగ్డే కూర్చొన్న సన్నివేశంతో ప్రారంభమవుతుంది. సూర్య చెప్పే డైలాగ్స్ సినిమాకు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. కోపం తగ్గించుకుంటా, మా నాన్న దగ్గర పని చేయడం మానేస్తాను.. రౌడీయిజం, తగాదాలు అన్నీ ఈ క్షణం నుండి మానేస్తాను.. నవ్వుతూ, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను"** అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్ ద్వారా సినిమాలో అతని పాత్ర ఎంత వైలెంట్‌గా ఉంటుందో ఆర్థం చేసుకోవచ్చు.

Details

మే1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్

భారీ బడ్జెట్‌తో 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 1980ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. చిత్రబృందం ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ సినిమాలోని ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది.