LOADING...
Salmankhan: సీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ

Salmankhan: సీఎం రేవంత్ రెడ్డితో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. గురువారం సాయంత్రం ముంబైలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తాను సహకరిస్తానని సల్మాన్ ఖాన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య జరిగిన చర్చల పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, తెలంగాణ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పెంచే అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, '#TelanganaRising' (తెలంగాణ రైజింగ్) అనే సందేశాన్ని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్‌పై మరింతగా నిలబెట్టేందుకు తాను కృషి చేస్తానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

వివరాలు 

రేవంత్ రెడ్డిని వరుసగా కలుస్తున్న సినీ ప్రముఖులు

తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను బలోపేతం చేయడానికి తన వంతు సహాయం అందిస్తానని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఇటీవల సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరుసగా కలుస్తున్నారు. గత జూలైలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ముఖ్యమంత్రిని కలిసి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జ్యూరీ అవార్డు కోసం వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ భేటీ కావడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సినీ రంగ ప్రముఖులతో ఇలాంటి భేటీలు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.