LOADING...
Ram Gopal Varma: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. ఎందుకంటే? 
చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. ఎందుకంటే?

Ram Gopal Varma: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. ఎందుకంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం తన కల్ట్‌ క్లాసిక్‌ 'శివ' రీ-రిలీజ్‌ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. అక్కినేని నాగార్జునను స్టార్‌ హీరోగా నిలబెట్టిన ఈ సినిమా నవంబర్‌ 14న మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు దర్శకుడు ఆర్జీవీ కూడా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా శివ 4K రీ-రిలీజ్‌ ను పురస్కరించుకుని ప్రత్యేక వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌, మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ తదితరులు వీడియో సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా 'శివ' సినిమాపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.

Details

 శివ తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం

శివ సినిమా చూసినప్పుడు నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సాధారణ సినిమా కాదు—ఒక విప్లవం, ఒక ట్రెండ్‌ సెట్టర్‌. తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం చెప్పింది. ఆ సైకిల్‌ చైన్‌ సీన్‌ ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయింది. నాగార్జున ఇంటెన్స్‌ యాక్టింగ్‌, ఎనర్జీ అద్భుతం. అమల, రఘువరన్‌ లాంటి నటీనటులు ప్రతి ఫ్రేమ్‌కి జీవం పోశారు. ఈ సినిమా మళ్లీ రీ-రిలీజ్‌ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేటి తరానికి ఇది తప్పక చూడాల్సిన టైమ్‌లెస్‌ ఫిల్మ్‌. రామ్‌ గోపాల్‌ వర్మ విజన్‌, కెమెరా యాంగిల్స్‌ అప్పట్లో కొత్తదనం తెచ్చాయి. తెలుగు సినిమాకి కొత్త దారిని చూపించాడు. హ్యాట్సాఫ్‌ టు ఆర్జీవీ.. 'శివ' తతెలుగు సినిమా ఉన్నంతకాలం చిరస్థాయిగా ఉంటుందని చిరంజీవి అన్నారు.

Details

'శివ' రీ-రిలీజ్‌ సందర్భంగా టీంకు ఆల్‌ ది బెస్ట్

చిరంజీవి వీడియో చూసిన తర్వాత దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. తన 'ఎక్స్‌ (ట్విట్టర్‌)' తఅకౌంట్‌లో ఆ వీడియోను షేర్‌ చేస్తూ 'థ్యాంక్యూ చిరంజీవి గారు..ఈ సందర్భంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. అనుకోకుండా నా మాటలు, చేతలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. మీ పెద్ద మనసుకి ధన్యవాదాలని వర్మ రాసుకొచ్చాడు. గతంలో పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవిలపై పలు విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈసారి మాత్రం తన మనసులోని గౌరవాన్ని వ్యక్తం చేశాడు. పవన్‌పై గతంలో సైటైర్లు వేసినా, చిరంజీవి వాటిని పట్టించుకోకుండా 'శివ' రీ-రిలీజ్‌ సందర్భంగా టీంకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ వీడియో విడుదల చేయడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడియో రిలీజ్ చేసిన చిరంజీవి