
ఏపీ సీఎం జగన్ బయోపిక్: వ్యూహం సినిమా టీజర్ విడుదల ఎప్పుడో చెప్పేసిన ఆర్జీవీ
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. సంచలనాలకు మారు పేరుగా మారిపోయిన వర్మ, తాజాగా వ్యూహం అనే సినిమాను తీసుకొస్తున్నాడు.
ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ను రేపు విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ఆర్జీవీ ప్రకటించాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్లు, సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్ ఆమీర్ నటిస్తున్నాడు. ఆయన సతీమణి భారతి పాత్రలో మానస నటిస్తున్నారు.
దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, శపథం అనే పేరుతో ఆ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.
Details
రాజకీయాలే టార్గెట్ గా వర్మ సినిమాలు
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఆర్జీవీ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలను విడుదల చేసాడు.
ఈ రెండు చిత్రాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి సెగలు రేపాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వ్యూహం, శపథం చిత్రాలు కూడా అదే మాదిరి సెగలు పుట్టిస్తాయని అనుకుంటున్నారు.
వ్యూహం, శపథం రెండు చిత్రాలు ఎలక్షన్ల కంటే ముందే రిలీజ్ అవుతాయని సమచారం. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని కూడా ఎన్నికల సమయం కంటే ముందుగానే రిలీజ్ చేసారు. మరేం జరుగుతుందో చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్విట్టర్ వేదికగా వ్యూహం టీజర్ విడుదల ప్రకటించిన ఆర్జీవీ
VYOOHAM teaser releasing dayafter 24 th 11 Am #RgvVyooham #RgvDen pic.twitter.com/hfGbk6izXm
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2023