RICKY GYAN KEJ: నవరాగాల తేజం..రిక్కీ కేజ్.. ఇంతకీ ఆయనెవరంటే.?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు.
ఇప్పటికే మూడు గ్రామీ అవార్డులను గెలుచుకున్న ఆయనకు ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డు లభించింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించగా, రిక్కీ కేజ్‌ను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసినట్టు వెల్లడించింది.
వివరాలు
పద్మశ్రీ అవార్డుపై రిక్కీ కేజ్ స్పందన
ఈ అవార్డు ప్రకటించిన అనంతరం రిక్కీ కేజ్ స్పందిస్తూ, తనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారమే తన అంతిమ లక్ష్యం కాదని, తన కెరీర్లో ఇది కొత్త ప్రారంభానికి సంకేతమని తెలిపారు. అంతర్జాతీయ కళాకారులను ప్రోత్సహించి, వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో ప్రధాని మోదీ ప్రత్యేకమైన దృష్టి సారించారని కొనియాడారు. ఇది కొత్త భారతదేశం కాబట్టి, ఇక్కడి కళాకారులు ఏదైనా కోరాల్సిన అవసరం లేదని అన్నారు.
వివరాలు
రిక్కీ కేజ్ గురించి
రిక్కీ కేజ్ 1981లో అమెరికాలోని ఉత్తర కరోలినాలో భారతీయ తల్లిదండ్రులకు జన్మించారు.
అతను 8ఏళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశంలోని బెంగళూరుకు స్థిరపడ్డాడు.
అక్కడే బిషప్ కాటన్ స్కూల్లో తన విద్యను అభ్యసించి,ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు.
2015లో మొదటిసారిగా గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు.బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో "విండ్స్ ఆఫ్ సంసారా"కోసం ఈ అవార్డు అందుకున్నాడు.
అనంతరం,2022లో అదే విభాగంలో "డివైన్ టైడ్స్" ఆల్బమ్‌కు గానూ గ్రామీ అవార్డును మరోసారి గెలుచుకున్నాడు.
అలా 2023లోనూ"డివైన్ టైడ్స్"కి మూడోసారి గ్రామీ అవార్డు అందుకున్నారు.
అంతేగాక గ్రామీఅవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా,అలాగే ఈ పురస్కారాన్ని అందుకున్న నాలుగో భారతీయుడిగా రిక్కీ కేజ్ గుర్తింపు పొందారు.