LOADING...
Rohit Shetty: జుహులో కలకలం.. రోహిత్‌ శెట్టి ఇంటి వద్ద దుండగుడి కాల్పులు
జుహులో కలకలం.. రోహిత్‌ శెట్టి ఇంటి వద్ద దుండగుడి కాల్పులు

Rohit Shetty: జుహులో కలకలం.. రోహిత్‌ శెట్టి ఇంటి వద్ద దుండగుడి కాల్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రోహిత్‌ శెట్టి నివాసం వద్ద అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. జుహు ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై గుర్తు తెలియని దుండగుడు అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పులు చేసిన అనంతరం నిందితుడు బైక్‌పై అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ముంబయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి నుంచి ఐదు బుల్లెట్‌ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Details

భారీగా మోహరించిన పోలీసులు

ఈ ఘటనను ముంబయి పోలీస్‌ కమిషనర్‌ దేవన్‌ భారతి ధృవీకరించారు. రోహిత్‌ శెట్టి నివాసం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించిన అధికారులు, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 'సింగం', 'గోల్‌మాల్' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిపై ఈ తరహా దాడి జరగడం బాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం రోహిత్‌ శెట్టి 'గోల్‌మాల్‌ 5' సినిమా పనుల్లో బిజీగా ఉండగా, ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Advertisement