Page Loader
Rishab Shetty: తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో.. త్వరలో షూటింగ్ 
తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో.. త్వరలో షూటింగ్

Rishab Shetty: తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంతార హీరో.. త్వరలో షూటింగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తేజా స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌ను-మాన్ చిత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌భాస్ క‌ల్కి త‌ర్వాత ఈ ఏడాది తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. కేవ‌లం న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన హ‌ను-మాన్ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 350 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. హానుమాన్‌కు సీక్వెల్‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ జై హ‌నుమాన్ అనౌన్స్‌చేసిన‌ విషయం తెలిసిందే. జై హ‌నుమాన్‌లో హీరోగా చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్, య‌శ్‌తో పాటు ప‌లువురు ద‌క్షిణాది స్టార్స్ పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. మ‌రోవైపు, సీక్వెల్‌పై చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డం... మోక్ష‌జ్ఞ‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ కొత్త మూవీని అనౌన్స్‌చేయ‌డంతో జై హ‌నుమాన్ ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

వివరాలు 

కాంతార హీరో 

తాజాగా ఈ సీక్వెల్‌పై మ‌రో ఆసక్తికర న్యూస్ టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. జై హ‌నుమాన్ మూవీలో కాంతార ఫేమ్ రిష‌బ్‌ శెట్టి హీరోగా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే రిష‌బ్‌శెట్టిని క‌లిసిన ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ను వినిపించిన‌ట్టు తెలుస్తోంది. హీరో క్యారెక్ట‌ర్‌ను ప‌వర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన తీరు న‌చ్చి ఈ సీక్వెల్‌లో న‌టించ‌డానికి రిష‌బ్‌శెట్టి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. జై హ‌నుమాన్ మూవీతోనే రిష‌బ్ శెట్టి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్నాడు. జై హ‌నుమాన్‌తోపాటు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో రిష‌బ్ శెట్టి మ‌రో సినిమా చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

వివరాలు 

మైత్రీ మూవీ మేక‌ర్స్ 

జై హ‌నుమాన్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీక్వెల్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ యాభై కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసిన‌ట్టు స‌మాచారం. హ‌నుమాన్ స‌క్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని డైరెక్ట‌ర్ డిమాండ్ చేసినంత మొత్తాన్ని ఇవ్వ‌డానికి మైత్రీ ప్రొడ్యూస‌ర్లు అంగీక‌రించిన‌ట్టు చెబుతున్నారు. 16 కోట్ల బ‌డ్జెట్‌...450 కోట్ల క‌లెక్ష‌న్స్ రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి,ద‌ర్శ‌క‌త్వం వహించిన చిత్రం కాంతార. క‌న్న‌డ సినీ చ‌రిత్రలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సెకండ్ మూవీగా నిలిచింది. కేవ‌లం 16 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన కాంతార 450 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ప్ర‌స్తుతం కాంత‌ర్‌కు ప్రీక్వెల్ చేయ‌బోతున్నాడు రిష‌బ్ శెట్టి. కాంత‌ర ఛాప్ట‌ర్ వ‌న్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.