Rishab Shetty: రిషబ్ శెట్టి షాకింగ్ నిర్ణయం.. వారిద్దరినీ అన్‌ఫాలో చేసిన హీరో
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. 'కాంతార చాప్టర్ 1' విజయంతో మంచి గుర్తింపు పొందిన ఆయన, తాజాగా తన సహనటీనటులను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం పరిశ్రమలో చర్చకు దారితీసింది. రిషబ్ శెట్టి, నటుడు రాజ్ బి, శెట్టితో పాటు నటి రుక్మిణి వసంతను అన్‌ఫాలో చేశారు. వీరితో పాటు 'కాంతార' వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాను కూడా ఆయన అన్‌ఫాలో చేయడం మరింత చర్చనీయాంశమైంది. దీంతో కొంతకాలంగా 'కాంతార' టీమ్‌లో విభేదాలున్నాయన్న ప్రచారాలకు ఊతం లభించింది.
వివరాలు
ఎటువంటి ప్రకటన చేయని రిషబ్ శెట్టి
అయితే హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాను అన్‌ఫాలో చేసినప్పటికీ, ఆ సంస్థ అధినేత విజయ కిరగందూర్‌ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఈ పరిణామాలపై రిషబ్ శెట్టి గానీ, నిర్మాణ సంస్థ గానీ ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఇక మరోవైపు, రిషబ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'జై హనుమాన్' కోసం సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.