NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇన్ కార్ ట్రైలర్: థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రితికా సింగ్ పాన్ ఇండియా మూవీ
    తదుపరి వార్తా కథనం
    ఇన్ కార్ ట్రైలర్: థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రితికా సింగ్ పాన్ ఇండియా మూవీ

    ఇన్ కార్ ట్రైలర్: థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రితికా సింగ్ పాన్ ఇండియా మూవీ

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 17, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గురు సినిమాలో బాక్సర్ పాత్రలో మెప్పించిన రితికా సింగ్, తెలుగు ప్రేక్షకులను పలకరించక చాలా రోజులైపోయింది. అప్పుడప్పుడు వచ్చిన అనువాద చిత్రాలు రితికా సింగ్ ని గుర్తుంచుకునేలా చేయలేకపోయాయి.

    ప్రస్తుతం ఆ పని చేయడానికి ఇన్ కార్ మూవీ వస్తున్నట్టు కనిపిస్తోంది. రితికా సింగ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఇన్ కార్ మూవీ ట్రైలర్ ఈరోజే విడుదలైంది. సినిమా మొత్తం కార్లోనే జరుగుతుందని ట్రైలర్ లో చూపించేసారు.

    రితికా సింగ్ పాత్రను ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేస్తారు. రేప్ చేయాలనే ఆలోచనతో మనుషులెవరూ కనిపించని చోటుకు తీసుకెళతారు. అక్కడి నుండి పారిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంది.

    చివరికి దుండగులపై పోరాడి పారిపోవాలని అనుకుంటుంది. ఇదంతా ఎలా జరిగిందన్నదే కథ.

    రితికా సింగ్

    కథ మొత్తం కార్లోనే

    కథ మొత్తం కార్లోనే జరుగుతుంది. థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రితికా సింగ్ భుజాల మీదే సినిమా బరువు ఉన్నట్టుగా తెలిసిపోతుంది. 5 భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

    ఇన్ కార్ సినిమాను హర్ష వర్ధన్ డైరెక్ట్ చేస్తున్నారు. కథ కూడా ఆయనే అందించారు. ఇన్ బాక్స్ పిక్చర్స్ బ్యానర్ పై అంజుమ్ ఖురేషీ, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్నారు. సందీప్ గోయత్, మనీష్ జంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చ్ 3వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

    హీరో వెంకటేష్ నటించిన గురు సినిమాలో హీరోయిన్ గా బాక్సర్ కనిపించింది రితికా సింగ్. నిజానికి ఇరుది సుట్రు అనే తమిళ సినిమాను గురు పేరుతో తెలుగులో రీమేక్ చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సినిమా

    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    "గాండీవధారి అర్జున" టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త చిత్రం తెలుగు సినిమా
    మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి తలనొప్పిగా మారిన అమీర్ పేట్ మెట్రో తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025