తదుపరి వార్తా కథనం
Ritu Choudhary:రీతూ చౌదరి శృంగారం వీడియో వైరల్: యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు.. చివరికి ఎం జరిగిందంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 26, 2023
03:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు బుల్లితెర నటి రీతూ చౌదరి (Ritu Choudhary) తన అందం, అభినయంతో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
జబర్దస్త్ షోలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె టెలివిజన్ రంగంలో రాణిస్తోంది.
వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకెళ్తుతోంది. ఈ నేపథ్యంలో రీతూ చౌదరి శృంగార వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిపై స్పందించిన రీతూ ఆ వీడియో తనది కాదని, ఎవరో మార్ఫింగ్ చేశారని పేర్కొంది.
ఆ ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ పోస్టు పెట్టిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Details
పోలీసులకు థ్యాంక్స్ చెప్పిన రీతూ చౌదరి
రీతూ చౌదరి శృంగారపు వీడియోను సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ఓ వీడియో తీసి పోలీసులకు థ్యాంక్స్ చెప్పింది.
అయితే అరెస్టు చేసిన వ్యక్తి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించకపోవడం గమానర్హం.