Page Loader
Robinhood: శాంటా అవతారంలో రాబిన్‌హుడ్.. క్రిస్మస్ తాతగా మారిపోయిన తాత
శాంటా అవతారంలో రాబిన్‌హుడ్.. క్రిస్మస్ తాతగా మారిపోయిన తాత

Robinhood: శాంటా అవతారంలో రాబిన్‌హుడ్.. క్రిస్మస్ తాతగా మారిపోయిన తాత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ యాక్టర్‌ నితిన్‌ తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. రాబిన్‌హుడ్ క్రిస్మస్‌ కానుకగా నేటి రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని విడుదల వాయిదా వేశారు. మేకర్స్‌ మాత్రం అభిమానులకు జోష్‌ నింపేందుకు 'రాబిన్‌హుడ్‌' లుక్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో నితిన్‌ శాంటా లుక్‌లో కనిపించి, ఒక చిన్నారికి క్రిస్మస్‌ కానుకగా గిఫ్ట్‌ అందిస్తున్నాడు. అనివార్య కారణాల వల్ల ఈ మూవీ డిసెంబర్‌ 25న విడుదల కాలేదు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్‌ వెల్లడించారు.

Details

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్

ఈ చిత్రం 2025 ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌ ఏజెంట్‌ జాన్ స్నో పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో నితిన్‌ డైలాగ్‌లు, డబ్బు చాలా చెడ్డది, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు, ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారంటూ చెప్పిన సంభాషణలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.