Page Loader
Triptii Dimri:'యానిమల్‌'లో నా పాత్రపై విమర్శలొచ్చాయి.. 'త్రిప్తి డిమ్రి' కీలక వ్యాఖ్యలు 
'యానిమల్‌'లో నా పాత్రపై విమర్శలొచ్చాయి.. 'త్రిప్తి డిమ్రి' కీలక వ్యాఖ్యలు

Triptii Dimri:'యానిమల్‌'లో నా పాత్రపై విమర్శలొచ్చాయి.. 'త్రిప్తి డిమ్రి' కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి త్రిప్తి డిమ్రి 'యానిమల్‌' చిత్రం ద్వారా ఒక్కసారిగా ఫేమ్‌ అందుకున్నారు. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు అందినట్టు తెలుస్తోంది. తాజాగా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 'యానిమల్‌' విడుదల తర్వాత ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పారు. 'యానిమల్‌' విడుదలైన తరువాత విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నా. కొన్ని సందర్భాలలో, తనను నెటిజన్లు అసభ్యంగా ట్రోల్‌ చేశారన్నారు. ఈ విమర్శలు తనకు మానసికంగా తీవ్ర బాధ కలిగించాయని చెప్పారు. అలాంటి విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని, తర్వాత మూడు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని తెలిపింది.

Details

నా సోదరి సాయం చేసింది

ఆ సమయంలో తన సోదరి తనకు చాలా సాయం చేసిందని గుర్తు చేశారు. ఇతరుల మాటలను పట్టించుకోకని తనకు ధైర్యం చెప్పిందన్నారు. 'యానిమల్‌' చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌, రష్మిక జంటగా నటించారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ డ్రామాలో, త్రిప్తి డిమ్రి జోయాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత త్రిప్తి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆమె అభిమానుల ప్రేమ గురించి మాట్లాడారు. బాలీవుడ్‌లో గొప్ప నటీనటులతో, దర్శకులతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, 'లైలా మజ్ను' చిత్రానికి తరువాత, తాను నటనలో శిక్షణ తీసుకున్నాని తెలిపింది. 'నేషనల్‌ క్రష్‌' అని పిలవడం తన దృష్టిలో ట్యాగ్‌ మాత్రమే కాదని, అభిమానుల ప్రేమ అని చెప్పింది.