Page Loader
RRR : 'ఆర్‌ఆర్‌ఆర్‌' బిహైండ్ అండ్ బియాండ్.. డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధం!
'ఆర్‌ఆర్‌ఆర్‌' బిహైండ్ అండ్ బియాండ్.. డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధం!

RRR : 'ఆర్‌ఆర్‌ఆర్‌' బిహైండ్ అండ్ బియాండ్.. డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2024
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమా వెనుక సృష్టించిన మాయాజాలం, బీహైండ్-ది-సీన్స్ స్టోరీలను 'ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్ అండ్ బియాండ్‌' పేరుతో డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్‌లో ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' కథకు ప్రపంచం సాక్ష్యంగా నిలుస్తుంది' అంటూ మూవీ టీమ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరణ వెనుక జరిగిన ఘటనలు, సినిమా నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక అంశాలను చూపించనున్నట్లు తెలుస్తోంది.

Details

రిలీజ్ తేదీని వెల్లడించని మేకర్స్

అయితే దీన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేస్తారన్న వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. రామ్‌ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రం ముఖ్యంగా దానిలోని యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వరల్డ్‌వైడ్‌గా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా, జపాన్‌లో కూడా చరిత్ర సృష్టించింది. అక్కడ 300 మిలియన్‌ యెన్‌లు (సుమారు రూ.18 కోట్లు) వసూలు చేస్తూ, ఈ క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది. ఓటిటిలో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది.

Details

మహేష్ బాబు ప్రాజెక్టుతో రాజమౌళి బిజి

పలు భాషల్లో డబ్‌ చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు దీన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్‌బాబు హీరోగా రూపొందించనున్న SSMB 29 అనే అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. గ్లోబ్-ట్రాకింగ్ నేపథ్యంతో రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జనవరి 2024లో ఈ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.