
Kuberaa : రూ. 100 కోట్ల 'కుబేరు'డు.. ఐదు రోజుల్లో రికార్డు కలెక్షన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాలో నాగార్జున, రష్మిక, జిమ్ సర్ఫ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఐదు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు సినిమా టీమ్ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన పోస్టర్ మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు టీమ్ తెలిపింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారాయణ, పుష్కూర్ రామ్మోహనరావు, అజయ్ కైకాల సంయుక్తంగా నిర్మించారు.
Details
నాగార్జున పాత్రపై ఎంపికపై ప్రశంసలు
ముఖ్యంగా నాగార్జున పాత్ర ఎంపికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 181 నిమిషాల నిడివితో తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే ధనుష్ హోమ్ గ్రౌండ్ అయిన తమిళనాడులో మాత్రం సినిమా ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద, "ప్రజలు థియేటర్లకు రావడం లేదేమో" అనే చర్చలు నడుస్తున్న తరుణంలో 'కుబేర' సినిమా ఐదు రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టడం విశేషం. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా ఇప్పటికే ఖాయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 'కుబేర'ని త్వరలో ఓటీటీలో విడుదల చేయనుంది.