Om Movie: మూడు రోజుల్లోనే రూ.101 కోట్లు.. ధనుష్ కెరీర్లో 'ఓం' సరికొత్త రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరో ధనుష్ (Dhanush), మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ఓం' (Om Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నవంబరు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్ల వసూళ్లు ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.101 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ప్రకటించాయి. దీంతో ధనుష్ కెరీర్లోనే అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా 'ఓం' నిలిచింది.
వివరాలు
భారీ తారాగణంతో యాక్షన్ థ్రిల్లర్
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రాన్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా నిర్మించారు.
సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.