Loading...
Vishwanath & Sons : నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్లు.. 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ జాతర!
నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్లు.. 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ జాతర!

Vishwanath & Sons : నాలుగు రోజుల్లోనే రూ.150 కోట్లు.. 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ జాతర!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath & Sons)బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. విడుదలైన రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా జోరు చూపిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న యునానిమస్ రెస్పాన్స్‌తో 'విశ్వనాథ్ & సన్స్' కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సూర్య కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.

వివరాలు

వర్కింగ్ డేస్‌లోనూ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు

తెలుగు, తమిళ భాషల్లో వీకెండ్‌తో పాటు వర్కింగ్ డేస్‌లోనూ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండటం సినిమా సత్తాను చాటుతోంది.

ముఖ్యంగా తల్లీ-కొడుకుల అనుబంధం, సున్నితమైన భావోద్వేగాలు, వినోదాన్ని మేళవిస్తూ దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను తెరకెక్కించిన విధానం కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య అందించిన క్లాసిక్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

అలాగే జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా 'విశ్వనాథ్ & సన్స్' విజయానికి కీలక బలంగా మారింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న ట్రెండ్‌ను చూస్తే ఈ చిత్రం త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT