Akhanda2 Thaandavam : అఖండ 2 మూవీపై ఆర్ఎస్ఎస్ ఛీప్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ 2' సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరం ప్రేక్షకులకు అర్థవంతంగా, ప్రభావవంతంగా చేరవేసే కథాంశంతో రూపొందించబడింది. అందుచేతనే అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా విషయాలను ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 'అఖండ 2' చిత్రాన్ని ప్రశంసిస్తూ, దర్శకుడు బోయపాటి శ్రీనుకి సినిమా అఖండ విజయాన్ని సాధించాలని ఆశీర్వదించారు. అలాగే సమాజానికి సానుకూల దిశ చూపించే, విలువలతో కూడిన చిత్రాలు మరింతగా రావాలని ఆయన ఆకాంక్షించారు.
Details
మా టీమ్ కు గౌరవాన్ని ఇచ్చింది
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ దేశం, ధర్మం, దైవం వంటి మూల విలువలను నేటి తరానికి గుర్తు చేయాలనే సంకల్పంతో 'అఖండ 2'ను రూపొందించాము. గౌరవనీయులైన మోహన్ భగవత్ ఆశీర్వాదం మా టీమ్ కు అపార గౌరవం ఇచ్చింది. ఇది మాకు మరింత బాధ్యత, స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపారు. 'అఖండ 2' భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావాలు, దేశభక్తి వంటి అంశాలను సమకాలీన కథన శైలితో మేళవిస్తూ రూపొందించారు. సినిమా యువతలో ధర్మబోధ, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత వంటి విలువలను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్ ఫుల్ షోస్‌తో రన్ అవుతూ, ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలతో విజయపథంలో ముందుకు సాగుతోంది.