Rukmini Vasanth: బికినీ వీడియో వివాదం.. ఫేక్ కంటెంట్‌పై రుక్మిణి లీగల్ యాక్షన్
ఈ వార్తాకథనం ఏంటి
రుక్మిణి వసంత్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన బికినీ వీడియో వ్యవహారంపై తాజాగా పూర్తి స్థాయిలో స్పష్టత లభించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద మరో మహిళ చేసిన బోల్డ్ ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి, అందులో రుక్మిణి వసంత్ ముఖాన్ని జతచేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు వెల్లడైంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో అభిమానులతో పాటు కన్నడ సినీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ నెలకొంది. దీంతో స్వయంగా స్పందించిన రుక్మిణి, ఆ ఫోటోలు, వీడియోలు తనవికావని స్పష్టం చేశారు. అవన్నీ పూర్తిగా నకిలీవని, ఏఐ డీప్‌ఫేక్ సాంకేతికతతో తయారు చేసిన ఫేక్ కంటెంట్ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్లడించారు.
వివరాలు
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
తన పేరుతో ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న డీప్‌ఫేక్, ఏఐ ఫోటోలకు తనతో ఎలాంటి సంబంధం లేదని రుక్మిణి వసంత్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ తప్పుడు కంటెంట్‌ను సృష్టించిన వారిపై మాత్రమే కాకుండా, దాన్ని కావాలనే సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఇందుకోసం తన లీగల్ టీమ్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారిక ఫిర్యాదు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
వారిపై లీగల్ యాక్షన్..
గతంలో రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి ప్రముఖ హీరోయిన్లు కూడా ఇలాంటి ఏఐ డీప్‌ఫేక్ వీడియోల బారిన పడి సైబర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహా సైబర్ వేధింపులను రుక్మిణి వసంత్ ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆమె హోమ్లీ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రుక్మిణి తీసుకున్న లీగల్ యాక్షన్ సరైన నిర్ణయమని పలువురు అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.