LOADING...
Saha kutumbhanaam: సఃకుటుంబానాం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. కొత్తగా కనిపించిన మేఘా ఆకాష్
సఃకుటుంబానాం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. కొత్తగా కనిపించిన మేఘా ఆకాష్

Saha kutumbhanaam: సఃకుటుంబానాం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. కొత్తగా కనిపించిన మేఘా ఆకాష్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2023
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ నటి మేఘా ఆకాష్ 'లై' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ వెంటనే ఛల్ మోహన్‌రంగ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇక రజనీకాంత్ నటించిన 'పేట'చిత్రంలో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ప్రస్తుతం మేఘాఆకాష్ వరుస సినిమాలతో బీజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం స:కుటుంబానాం. ఈచిత్రానికి ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి ఓ క్రేజ్ అప్డేట్ బయటికొచ్చింది. నేడు మేఘా ఆకాశ్ సందర్భంగా 'స:కుటంబానాం' నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్, సిరి పాత్రలో అలరిస్తుందని చిత్ర బృందం పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్