LOADING...
Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు 
సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు

Sai Pallavi : సాయిపల్లవికి తమిళనాడు ప్రభుత్వం నుంచి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరోయిన్స్‌లో ఒక్కోక్కరి జీవన శైలి వేరుగా ఉంటుందనే విశేషం తెలిసిందే. అలా నటి సాయి పల్లవి కూడా ఇతర హీరోయిన్స్‌లా కాకుండా బిన్నమైన లైఫ్‌ స్టైల్ కలిగినవారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా ఉండే నటిగా ప్రసిద్ధి పొందింది. దీనివల్ల ఆమెకు టాలీవుడ్‌లో 'లేడీ పవర్ స్టార్' అనే ప్రత్యేక ట్యాగ్ కూడా దక్కింది. 1992లో కేరళలో పుట్టిన సాయి పల్లవి చిన్నప్పటి నుంచే డాన్స్‌పై ఆసక్తి చూపుతూ ప్రావీణ్యం సాధించింది. దీనివల్ల సినిమాల్లో అవకాశాలు దొరక్కపోలేదు. 2015లో 'కిరిక్ 1' ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తన సహజ నటన, డ్యాన్స్, ఫిట్‌నెస్, భావాలను చక్కగా ప్రదర్శించే ప్రతిభతో సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించింది.

Details

'కలైమామణి' అవార్డు అందజేత

అందుకే ఆమెకు తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'కలైమామణి' అవార్డు అందించింది. శనివారం సాయంత్రం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతులమీదుగా ఈ అవార్డును సాయి పల్లవి స్వీకరించారు. ఈ అవార్డు ఆమె కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలవనుంది. 2021, 2022, 2023 సంవత్సరాల్లో మొత్తం 90 మంది కళాకారులు ఈ గౌరవాన్ని పొందారు. వారిలో ఎస్‌.జె. సూర్య, విక్రమ్ ప్రభు వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. అభిమానులు, సినీ రంగంలోని వారు ఆమెకు అభినందనలు తెలిపారు. ఇది సాయి పల్లవి ప్రతిభకు అందిన మరొక గుర్తింపు అని చెప్పొచ్చు.