Sai Pallavi : ఫ్లాప్ హీరోతో జోడీ కట్టిన సాయి పల్లవి... 'ఏక్ దిన్' ట్రైలర్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా కుటుంబ వారసుడు వరుణ్ తేజ్ తన కెరీర్ ప్రారంభంలో ముకుంద, కంచె సినిమాలతో తన నటనను నిరూపించుకున్నాడు. అయితే తరువాత వచ్చిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని లోఫర్, అలాగే మిస్టర్ సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచి వరుణ్ తేజ్ కెరీర్‌పై ప్రభావం చూపాయి. ఈ పరిస్థితుల్లో విడుదలైన ఫిదా చిత్రం వరుణ్ తేజ్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని, అతని సోలో హీరో కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సాయి పల్లవి కూడా వరుణ్ తేజ్‌తో కలిసి భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది.
వివరాలు
తండేల్ లో "బుజ్జితల్లి" పాత్రలో నటించిన సాయి పల్లవి
అక్కినేని కుటుంబానికి చెందిన నటుడు నాగ చైతన్యకు తండేల్ సినిమా ఒకరకంగా సెకండ్ ఇన్నింగ్స్‌లా మారింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, చైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ముందుగా ఆయన వరుసగా మూడు డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు. ఈ చిత్రంలో "బుజ్జితల్లి" పాత్రలో నటించిన సాయి పల్లవి తన నటనతో మంచి ప్రశంసలు అందుకుంది. ఇదే జంట గతంలో కలిసి నటించిన లవ్ స్టోరీ కూడా కమర్షియల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే, లవ్ టుడే రీమేక్‌గా వచ్చిన లవ్యాపా సినిమాతో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ప్రేక్షకులను నిరాశపరిచాడు.
వివరాలు
ఫ్లాప్ హీరోకు మళ్లీ మంచి అవకాశం
ఇప్పుడు మరో రీమేక్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఫ్లాప్ హీరోకు మళ్లీ మంచి అవకాశం కల్పించేందుకు సాయి పల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం ఏక్ దిన్. మూడేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను "వన్ లవ్ అండ్ వన్ చాన్స్" అనే కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీగా మేకర్స్ తీసుకువస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సాయి పల్లవి అమరన్ సినిమాతో పాటు దీనిపై కూడా ఒకేసారి పనిచేసినట్లు ఆమె హెయిర్ స్టైల్ ద్వారా అర్థమవుతోంది. సాధారణంగా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునే సాయి పల్లవి, ఈ సినిమాలో కూడా హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.
వివరాలు
ప్రాధాన్యం ఉన్న పాత్రలకే సాయి పల్లవి గుర్తింపు
భారీ పారితోషికం ఆఫర్ చేసినా కేవలం డబ్బు కోసం సినిమాలు చేయకుండా,కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పుడే సినిమాలను ఎంపిక చేసుకుంటూ సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే జునైద్ ఖాన్ లాంటి ఫ్లాప్ హీరోతో జోడీ కట్టడం ఆమె కెరీర్‌కు కొంత రిస్క్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఆమె బాలీవుడ్ ఎంట్రీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఫలితం కీలకంగా మారింది.
వివరాలు
బాలీవుడ్ ప్రేక్షకులను సాయిపల్లవి మెప్పిస్తుందా?
ఈసినిమా హిట్ అయితే సమస్యేమీ ఉండదు.కానీ అంచనాలకు తగ్గట్లుగా లేకపోతే,భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి బాలీవుడ్ ప్రేక్షకులను సాయిపల్లవి మీరాగా మెప్పిస్తుందా?సీతగా మంత్ర ముగ్ధులను చేస్తుందా? అలాగే జునైద్ ఖాన్‌కు ఈ సినిమా నిజంగా బ్రేక్ ఇస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.