Page Loader
Saif Ali Khan: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి

Saif Ali Khan: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడటంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగింది. సైఫ్,అతని కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా, ఇంట్లోకి చొరబడి దుండగుడు దొంగతనానికి యత్నించాడు. ఈ క్రమంలో సైఫ్ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, దుండగుడు దాడి చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడిని పట్టుకోవడానికి పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దాడిలో సైఫ్ ఆరో చోట్ల గాయాలు పొందినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడి