LOADING...
Saif Ali Khan: ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సైఫ్ అలీఖాన్
ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సైఫ్ అలీఖాన్

Saif Ali Khan: ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సైఫ్ అలీఖాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 21, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు సైఫ్ అలీఖాన్‌ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇటీవల తన ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు దాడి చేయడంతో ఆయనకు గాయాలైన విషయం తెలిసిందే. ఆరు రోజుల పాటు లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. వైద్యులు సైఫ్‌కు వారంపాటు బెడ్‌రెస్ట్‌ సూచించడంతో పాటు ఇన్ఫెక్షన్‌ చేరకుండా ఉండేందుకు కొంతకాలం ఇతర వ్యక్తులతో దూరంగా ఉండాలని సూచించారు. సైఫ్‌ ప్రస్తుతం ఇంటికి బయలుదేరనున్నారు. ఆయనతో పాటు తల్లి, ప్రముఖ నటి షర్మిలా టాగూర్‌ ఆస్పత్రిలో ఉన్నారు. సైఫ్‌ సతీమణి కరీనా కపూర్‌, కుమార్తె సారా అలీఖాన్‌ తదితరులు కొంతసేపటి క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు.

Details

జనవరి 16న సైఫ్ అలీఖాన్ పై దాడి

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. గత జనవరి 16న సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమైందని, వైద్యులు సర్జరీ ద్వారా వెన్నెముక నుంచి కత్తిని తొలగించారని సమాచారం. ఈ కేసు విషయంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరిపి నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు.