Loading...
Saif Ali Khan: బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితుడి నుంచి నటుడు సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపులు?
బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితుడి నుంచి నటుడు సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపులు?

Saif Ali Khan: బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితుడి నుంచి నటుడు సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపులు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జీషాన్ అక్తర్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. అయితే నిజంగానే అక్తర్ బెదిరించాడా? లేక అతడి పేరుతో మరెవరైనా ఈ పని చేశారా? అనే కోణంలో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇటీవల బాలీవుడ్ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్‌కు వచ్చిన బెదిరింపులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై పోలీసుల దర్యాప్తు

వివరాలు 

కపూర్, ఖురానాలకు బెదిరించేందుకు ఏఐ వినియోగం

గతంలో తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు బెదిరింపులు వచ్చిన ఘటనల్లో పోలీసులు బెంగళూరుకు చెందిన వైభవ్ మిశ్రా అనే 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.

అతడు ఐఐటీలో చదువుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి ఈ బెదిరింపులు పంపినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే వైభవ్ మిశ్రాకు ఎలాంటి గ్యాంగ్‌లతో సంబంధాలు లేవని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా ఈ వారం ప్రారంభంలో బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

ADVERTISEMENT