Sikander Bharti: బాలీవుడ్ లో విషాదం.. దర్శకుడు సికిందర్ భర్తీ మృతి
బాలీవుడ్‌కు విశేష కృషి చేసిన ప్రముఖ సినీ దర్శకుడు సికిందర్ భర్తీ శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. ముంబైలోని జోగేశ్వరి వెస్ట్‌లోని ఓషివారా శ్మశానవాటికలో శనివారం ఉదయం 11:00 గంటలకు ఆయన అంత్యక్రియలు జరిగాయి. భారతి తన దైన దర్శక ప్రతిభతో ప్రేక్షకులను బాగా అలరించారు. బాలీవుడ్ పై చెరగని ముద్ర వేసిన చలనచిత్రాలు చాలా ఉన్నాయి. ఎంతో మంచి భవిష్యత్తు వుంది. కానీ ఆయన 60 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. మరణానికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు.
భర్తీ వారసత్వం
ఆయన దర్శకత్వంలో పలు చిత్రాలు వున్నాయి.వీటిలో ఘర్ కా చిరాగ్,జాలిమ్,రూపాయే దస్ కరోడ్, భాయ్ భాయ్,సైనిక్,సార్ ఉతా కే జియో,దండ్-నాయక్, రంగీలా రాజా ఉన్నాయి. ఐనప్పటికీ, ఆయనకి అత్యంత గుర్తింపు నిచ్చిన మూవీ 1994 లో వచ్చిన దో ఫంటూష్ . భర్తీకి భార్య, పింకీ తో సహా ముగ్గురు పిల్లలుఉన్నారు. వారి పేర్లు సిపిక, యువిక , సుక్రత్. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడిని కోల్పోయామని సినీ వర్గాలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. భర్తీ సినీ కెరీర్ విజయవంతంగా సాగింది ఆయన అక్షయ్ కుమార్, గోవిందా, అమ్జాద్ ఖాన్ , రాజేష్ ఖన్నా వంటి హిందీ సినిమా సూపర్ స్టార్స్ తో కలిసి పనిచేశారు.