
Salaar: టీవీ ప్రీమియర్‌లో సత్తా చాటిన 'సలార్'.. అత్యధిక వ్యూస్‌ను సాధించిన చిత్రాల జాబితాలో చోటు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించి పలు రికార్డులను అందుకుంది.
థియేటర్‌లలో,ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం టీవీ ప్రీమియర్‌లో కూడా రికార్డును సాధించింది. ముఖ్యంగా హిందీలో ఈ ఘనత సాధించడం విశేషం.
గతేడాది విడుదలై కాసుల వర్షం కురిపించిన 'సలార్' తర్వాత నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా పలు రికార్డులు సాధించింది.
ఇటీవల,దీని హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ఉత్తరాదిలో టీవీ ద్వారా ప్రదర్శించగా,అది మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఏకంగా 30 మిలియన్ల వ్యూస్‌ను సాధించడం విశేషం.
వివరాలు
రెండో పార్ట్ 'శౌర్యాంగపర్వం'పై ఆసక్తి
దీంతో 2024లో అత్యధిక వీక్షణలు పొందిన టాప్ మూడు చిత్రాల జాబితాలో 'సలార్' నిలిచింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ టీవీ సంస్థ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సంబర పడుతున్నారు.
'సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్' భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో,దీని రెండో పార్ట్'శౌర్యాంగపర్వం'పై ఆసక్తి నెలకొంది.
దీనికి సంబంధించి,ప్రశాంత్ నీల్,ఆయన టీమ్ మొదట అనుకున్న స్క్రిప్ట్‌ను మరింత మెరుగులు దిద్దుతూ 'శౌర్యాంగపర్వం' సిద్ధం చేస్తున్నారు.
'సలార్2'సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని ప్రశాంత్ నీల్ గతంలో చాలాసార్లు తెలిపారు.
త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేశారు.
ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.నవంబరులో #NTR31 షూటింగ్ ప్రారంభం కానుంది.మరోవైపు,ప్రభాస్ కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.