Page Loader
Salaar Release Trailer : మరో 4 రోజుల్లో సలార్ విడుదల.. మరో యాక్షన్ ట్రైలర్‌ రిలీజ్
Salaar Trailer : సలార్ విడుదల ముంగిట మరో యాక్షన్ ట్రైలర్‌ రిలీజ్

Salaar Release Trailer : మరో 4 రోజుల్లో సలార్ విడుదల.. మరో యాక్షన్ ట్రైలర్‌ రిలీజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 18, 2023
06:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాక్షన్ మాస్ సినిమా 'సలార్‌' నుంచి మరో ట్రైలర్‌ విడుదలైంది.యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్‌,పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలుగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం 'సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌'. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 22న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గరవుతోన్న సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు వరుస సర్‌ప్రైజ్‌లు ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 'సలార్‌' రిలీజ్‌ డేట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. స్నేహం, అబ్బురపరిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రభాస్ సలార్ ట్రైలర్ రిలీజ్